A sample of other songs in raagabox lyrics * 1 *

అల్లో నేరేడు కళ్ళదాన

Album: శీను
Tag: telugu
Lyrics: అల్లో నేరేడు కళ్ళదాన - ప్రేమ వల్లో పడ్డానె పిల్లదాన
హెల్లొ వర్ణాల పూల వాన - నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైన ఇంత ప్రేమ నా మీదేనా
కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా
అల్లో నేరేడు కళ్ళదాన - ప్రేమ వల్లో పడ్డానె పిల్లదాన
హెల్లొ వర్ణాల పూల వాన - నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
దాయి దాయి అనగానే చేతికందేన చంద్రవదనా
కుంచై నువ్వే తాకగానే పంచప్రాణాలు పొందినానా
బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా
ఎదో చిత్రం చేయగా చేరువైయా నేనే చెలిగా
రెప్పమూసినా తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్న దీపమా
అల్లో నేరేడు కళ్ళదాన - ప్రేమ వల్లో పడ్డానె పిల్లదాన
హెల్లొ వర్ణాల పూల వాన - నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
అన్నెం పున్నెం లేని వాడని అనుకొన్నాను ఇన్నినాళ్ళు
అభం సుబం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె కళ్ళు
మైకం పెంచే మాయతొ మూగ సైగే చేసే దాహమా
మౌనం మీటే లీలతో తేనె రాగం నేర్పే స్నేహమా
ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి సందడంటి సందడల్లే చేరుకున్న రూపమా
అల్లో నేరేడు కళ్ళదాన - ప్రేమ వల్లో పడ్డానె పిల్లదాన
హెల్లొ వర్ణాల పూల వాన - నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైన ఇంత ప్రేమ నా మీదేనా
కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా